- తిరుమలదేవుని గుట్ట వద్ద ఆర్వోబీ పూర్తిచేయండి
- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
- కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్నకు వినతి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్స్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్నను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలో పెంగింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్స్ పై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు అందజేశారు.
ముఖ్యంగా మహబూబ్ నగర్ లోని తిరుమలదేవుని గుట్ట వద్ద ఆర్వోబీ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. ఈ నిర్మాణం, అవశ్యకత, జిల్లా ప్రజలకు ఉపయోగం, ప్రయోజనాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఎంపీ అరుణ వినతులపై కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న సానుకూలంగా స్పందించారు.


