లోడ్ కు సరిపడేలా సత్వర చర్యలు
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
కాకతీయ, జనగామ : రాబోయే వేసవిలో లోడ్ కు సరిపడేలా 100 నుంచి 160కేవీఏ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు చేసే విధంగా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం జనగాం జిల్లాలోని వడ్లకొండ 220 / 132 కెవి సబ్ స్టేషన్ ను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సందర్శించారు. కొత్తగా అవసరమైన ఫీడర్ల కొరకు ప్రతి పాదనలు పంపాలని చెప్పారు. అనంతరం నూతనంగా నిర్మించే సూపెరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయాన్ని కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. పనుల పురోగతిపై చర్చిస్తూ అధునాతనంగా తీర్చిదిద్దాలని , పచ్చదనం , మొక్కలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు . తదనంతరం 33/11 కెవి పెంబర్తి గేట్‌వే సబ్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆపరేషన్ & మెయింటెనెన్స్ సిబ్బందితో సమావేశమై, విద్యుత్ సరఫరా నాణ్యత, ఫీల్డ్ సమస్యలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సీఎండీ డివిజినల్ ఇంజనీర్లతో సమీక్షిస్తూ రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం పనులు వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఇంటర్ లింకింగ్ పనులు, కొత్త సబ్ స్టేషన్ ల నిర్మాణం పనులు త్వరగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ కలెక్షన్లు 100 శాతం రావాలని అన్నారు . కార్యక్రమంలో జనగాం సూపరింటెండింగ్ ఇంజనీర్ సిహెచ్. సంపత్ రెడ్డి, డిఈ లు లక్ష్మానారాయణ రెడ్డి, గణేష్, విజయ్ కుమార్ , సారయ్య, ఏడిఈ స్వామి రెడ్డి , ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు , ఎస్ఏ ఓ సుదర్శన్ తదితర అధికారులు పాల్గొన్నారు.


