కాకతీయ, ఇనుగుర్తి : రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని సెంటర్లకు తీసుకురావాలని మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి అన్నారు. బుధవారం మండలంలోని రైతు వేదికలో వరి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంటర్లో రైతులకు అన్ని సౌకర్యాలు
కల్పించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన విధంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకున్న తర్వాతనే సెంటర్ తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీవో పార్థసారథి, ఎస్సై కరుణాకర్, ఏఈఓ లు ముజాహిద్, భాస్కర్, సెంటర్ ఇన్చార్జులు, రైస్ మిల్లర్లు, గ్రామ పాలన అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఐకెపి, సొసైటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


