epaper
Monday, March 2, 2026
epaper

మతిభ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు

మతిభ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు
కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

కాకతీయ, మంథని : మంథని ఎమ్మెల్యే, ఐటీ–పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులపై పుట్ట మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. రాజకీయాల్లో స్థాయి, సంస్కారం లేకుండా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ మంథని, రామగిరి, కమాన్‌పూర్, ముత్తారం మండలాల కాంగ్రెస్ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పుట్ట మధుకు రాజకీయ గుర్తింపు తీసుకొచ్చింది దుద్దిళ్ల కుటుంబమేనని గుర్తుచేశారు. స్వర్గీయ శ్రీపాద రావు ఆశ్రయంతోనే అతడు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీటీసీ, జెడ్పిటీసీ వంటి పదవులు పొందాడని తెలిపారు. అలాంటి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని స్థాయి మరిచి మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. బహుజనవాదం పేరుతో మాట్లాడుతున్న పుట్ట మధు ఇప్పటివరకు ఎంతమందిని నాయకులుగా తీర్చిదిద్దాడో అంబేద్కర్ సాక్షిగా చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యక్తిగత కుటుంబాలను రాజకీయాల్లోకి లాగలేదని, విమర్శలు వ్యక్తుల పనితీరుపై మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. శ్రీధర్ బాబు తెస్తున్న నిధులు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే పుట్ట మధు అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. నలభై ఏళ్లుగా ప్రజలు ఎందుకు అదే కుటుంబాన్ని గెలిపిస్తున్నారో పుట్ట మధు ఆలోచించాలని సూచించారు. అదేవిధంగా పుట్ట మధు ఆస్తులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏమీ లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో, వెంకటాపూర్లో ఉన్న వందల ఎకరాలు, ఫ్లాట్లు, కార్లు, విలాసవంతమైన భవనాల మూలం ఏమిటో వెల్లడించాలని అన్నారు. ఇకపై శ్రీధర్ బాబు కుటుంబంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు, మంథని ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాజకీయాల్లో సంస్కారం, గౌరవం పాటించాలని పుట్ట మధుకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img