రేపు పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సొసైటీ సీఈఓ ఎల్లబోయిన ఆంజనేయులు
కాకతీయ, ఖానాపురం: ఖానాపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఏఎంసీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు ప్రారంభించనున్నట్లు సొసైటీ సీఈఓ ఎల్లబోయిన ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఖానాపురం మండలంలోని ఏఎంసీ సబ్ మార్కెట్ ఖానాపురం, బుధరావుపేట, మంగళవారి పేట, ధర్మరావు పేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు


