కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలో మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ రవి కుమార్ కు వినతి పత్రం అందజేస్తారు.. ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ.. మండలంలో సుమారుగా 6000 ఎకరాలలో మొక్కజొన్న , 22 వేల ఎకరాలలో వరి పంట వేశారని , వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్ కి వస్తాయని రైతులు అకాల వర్షాలకు ఇబ్బంది పడకుండా గోనెసంచులు, హమాలీలు, లారీలు ,కొనుగోలు చేసే మిల్లులను ముందుగానే ప్రణాళిక బద్ధంగా తయారు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ రవి కుమార్ కు ,మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మొక్కజొన్న , వరి రైతులకు ప్రైవేటు వ్యాపారస్తుల బారిన పడకుండా ప్రభుత్వం అధికారంయంత్రాగం కొనుగోలు వెంటనే చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న ప్రతి క్యింటా 2400రూ లకు ,వరి 2500 ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని , అకాల వర్షాల కారణంగా వరి మొక్కజొన్న రాసులు తడవకుండా డార్బల్స్ అందజేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సమ్మతరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తోటకూరలు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గురుమూర్తి పాల్గొన్నారు.


