కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని మోదీ ఫొటో మార్ఫింగ్ చేసినందుకు బీజేపీ వర్కర్లు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీతోపాటు ఆయన తల్లిని కూడా కాంగ్రెస్ నేతలు అవమానించిన తీరుపై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పుణెలో కాంగ్రెస్ నేత ప్రకాశ్ పగరే చీర కట్టడం పెద్ద వివాదం రేగింది. ప్రధాని మోదీకి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలతో స్థానిక బీజేపీ కార్యకర్తలు అతనికి చీర కట్టించారు.
స్థానిక బీజేపీ ఆఫీస్ బెయరర్ నందు పరబ్‌తో పాటు మరికొందరు పగరేను రోడ్డుపై అడ్డుకుని, బలవంతంగా చీర కట్టించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన పగరే తనను దారుణంగా అవమానించారని.. తనపై కులం పేరుతో దూషణలు చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
BJP workers force 73-year-old Congress leader to wear sari over social media post against PM Modi.
“Posting such a distasteful image of our Prime Minister is not only offensive but also unacceptable. If such attempts are made again to defame our leaders, the BJP will give an… pic.twitter.com/cA9SZu12y9
— The Tatva (@thetatvaindia) September 23, 2025
అయితే, బీజేపీ నేత నందు పరబ్ మాత్రం.. మోదీని కించపరచినందుకే ఈ చర్య తీసుకున్నామని సమర్థించుకున్నారు. దీంతో ఈ సంఘటన రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.


