epaper
Monday, January 26, 2026
epaper

ప్రజా సేవే మ‌న‌ లక్ష్యం కావాలి

ప్రజా సేవే మ‌న‌ లక్ష్యం కావాలి
సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేర్చాలి
అధికారులు ప్రజా సేవకుల్లా పనిచేయాలి
భ‌ద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
జాతీయ జెండా ఆవిష్కరించి..వేడుకలు

కాకతీయ, కొత్తగూడెం : ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా సేవకులుగా పని చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం, ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఉద్యోగ జీవితం మొత్తం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా సాగాలని, సేవా కాలం ప్రజల అభ్యున్నతికే అంకితమవాలని అధికారులకు సూచించారు. దేశభక్తుల త్యాగాలు, ఆశయాల స్ఫూర్తితో భారత సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ప్రజలకు తెలియజేయడంలో ఆనందంగా ఉందని తెలిపారు.

మహిళల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి

మహిళల సంక్షేమం దిశగా అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించబడుతోందన్నారు. ఈ పథకం మహిళల భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక భారం తగ్గింపులో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ఉచిత పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, మహిళల ఆరోగ్య పరీక్షల ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో రైతును రాజుగా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల ఆదాయం పెంపుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

సాగునీటి వసతులు–గృహ పథకాలు

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన కాలువ పనులు పూర్తిచేసి పంప్ హౌసులు ప్రారంభించామన్నారు. జిల్లాలో కొత్త ఆయకట్టు అభివృద్ధి, చెరువుల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉప కాలువల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ పేద కుటుంబాలపై విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తున్నట్లు చెప్పారు. పౌర సరఫరాల శాఖ ద్వారా చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నామన్నారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పీఎం శ్రీ పాఠశాలలు, గ్రంథాలయాల ఏర్పాటు, పదో తరగతి ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక తరగతులతో విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ

విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గణతంత్ర...

జిల్లా కోర్టులో గ‌ణ‌తంత్ర వేడుకలు

జిల్లా కోర్టులో గ‌ణ‌తంత్ర వేడుకలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం...

రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసు సేవలు!

రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసు సేవలు! జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్...

ఆటల‌తోనే ఆరోగ్యానికి బ‌లం

ఆటల‌తోనే ఆరోగ్యానికి బ‌లం వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాక‌తీయ‌, కారెప‌ల్లి :...

టీజీవో భవన్‌లో గణతంత్ర వేడుకలు

టీజీవో భవన్‌లో గణతంత్ర వేడుకలు కాకతీయ, ఖమ్మం: 77వ గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ...

ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా రెండున్నర కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కమీషన్ల కోసమే...

సింగరేణి భవిష్యత్తు కోసం నడుం బిగిద్దాం!

సింగరేణి భవిష్యత్తు కోసం నడుం బిగిద్దాం! పోటీ మార్కెట్లో నిలవాలంటే ధర–నాణ్యతే కీలకం నష్టాల...

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img