epaper
Monday, March 9, 2026
epaper

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి
ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి
అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా పనిచేయాలి
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే పరిపాలన అవసరం
ప్రజావాణిలో అధికారుల‌కు కలెక్టర్ అంకిత్ ఆదేశాలు

కాకతీయ, కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి కలెక్టర్ ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించారు. వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

పలు వినతులపై ఆదేశాలు

అశ్వాపురం మండలం వేములూరు గ్రామానికి చెందిన కొమరం నాగమణి తనకు ఇంటి స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేదని తెలిపారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనకు ఇల్లు ఉన్నట్లు చూపించారని పేర్కొంటూ తన పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు. ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సుశీల గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు లబ్ధి అందలేదని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించగా దరఖాస్తు చేసుకోలేదని చూపుతున్నారని చెప్పారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఇల్లందు ఎంపీడీవోకు కలెక్టర్ ఆదేశించారు. బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన మాదాబత్తుల రమణ ఇంటర్ వరకు చదివి 77 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నానని తెలిపారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, జీవనోపాధి కోసం దివ్యాంగుల స్కూటీ మంజూరు చేయాలని కోరారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేశారు. సారపాకకు చెందిన బిటియా ఏసు తన తండ్రి అనారోగ్యంతో 2021లో మరణించారని, అప్పట్లో మరణ ధ్రువీకరణ పత్రం పొందలేకపోయామని తెలిపారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమస్య ఎదురవుతోందని పేర్కొన్నారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్‌కు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..! పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం బాధితుల బాధను రాజకీయ...

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు...

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ,...

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా కీలకం అర్హులైన బాలికలను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img