విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట
గట్లకుంటలో రైతులతో నేరుగా చర్చ
లైన్లు, మీటర్లు, అగ్రికల్చర్ సర్వీసులపై ఫిర్యాదుల స్వీకరణ
కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గట్లకుంట గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమేష్ పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. లూజు లైన్లు, మిడిల్ పోల్స్, లైన్ ఎక్స్టెన్షన్, మీటర్లు, అగ్రికల్చర్ సర్వీసులకు సంబంధించిన సమస్యలను రైతుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్లపై ఉన్న ఇబ్బందులను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ రమేష్ తెలిపారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా వారంలో రెండు రోజులు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను స్వీకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తినేని యాకలక్ష్మి సోమన్న, ఉపసర్పంచ్ వెంకటయ్య, వార్డు సభ్యులు, నాయకుడు ముక్తర్ పాషా, రైతులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


