epaper
Friday, April 10, 2026
epaper

డంపింగ్ యార్డ్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జాపోరాటం

డంపింగ్ యార్డ్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జాపోరాటం
ప్రాణాలతో ఆటలాడితే సహించబోం
భూగర్భ జలాలు క‌లుషిత‌మ‌వుతాయి..
ప్ర‌జారోగ్యం ప్ర‌మాదంలో ప‌డుతుంది
మ‌ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హుజురాబాద్‌లో ఉద్యమానికి ఎంపీ మద్దతు

కాకతీయ, హుజురాబాద్ : ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా హెచ్చరించారు. హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనకు మద్దతుగా ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవహర్‌నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్‌ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడి పరిస్థితులు హుజురాబాద్‌లో పునరావృతం కాకూడదని అన్నారు. ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

చెత్త ప్లాంట్లు పేరుకే అంటూ విమర్శ

చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామనే వాదన కేవలం మాటలేనని, ఆ ప్లాంట్లు సక్రమంగా పనిచేయవని ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుల ప్రభావంతో భూగర్భ జలాలు కాలుష్యానికి గురై, చెరువులు, బోర్లు పూర్తిగా నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్‌ల నుంచి కారే ద్రవాలు తీవ్రమైన దుర్వాసనతో పాటు వ్యాధులను వ్యాప్తి చేస్తాయని, ట్రీట్మెంట్ ప్లాంట్లు కేవలం పేరుకే ఉంటాయని ఆరోపించారు. రాజకీయాల కోసం తాను రాలేదని, ప్రజల పక్షాన నిలబడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అవసరమైతే ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటును పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, హుజురాబాద్ ప్రజలతో కలిసి చివరివరకు పోరాటం కొనసాగిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌,...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ,శంకరపట్నం :...

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొమురయ్య కాకతీయ,చిగురుమామిడి : భవన...

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఏప్రిల్ 16...

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి సిపిఎం...

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి మెరుగైన వైద్యం అందించాలి ఆరోగ్య అవగాహన కల్పించాలి కలెక్టర్ గరిమ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img