విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట : ఏఈ భార్గవి
కాకతీయ, నెల్లికుదురు : విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలు సమస్యలను తెలియపరచి ప్రజా బాటను విజయవంతం చేయాలని ఏఈ భార్గవి అన్నారు. గురువారం
మునిగలవీడు గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారి ఏఈ తో కలిసి సర్పంచ్ చైతన్య నాగరాజు ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా సర్పంచ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్యలు, లూస్ వైర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లులు ఎక్కువగా లేదా తక్కువగా రావడం, ట్రాన్స్‌ఫార్మర్లలో లోపాలు, కరెంట్ వైర్లపై ఉన్న చెట్ల కొమ్మలు, రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాల సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా బాట వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, సురేష్, మరియు గ్రామ రైతులు & ప్రజలు పాల్గొన్నారు.


