మల్కాజ్గిరి నగరపాలక సంస్థలో ప్రజావాణి
కాకతీయ, మేడ్చల్–మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన కార్యక్రమంలో పౌరులు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు వినతిపత్రాల రూపంలో సమర్పించారు. అందిన ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ సంబంధిత విభాగాధిపతులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 33 ఫిర్యాదులు అందగా, ఇంజనీరింగ్ విభాగానికి 11, టౌన్ ప్లానింగ్‌కు 15, రెవెన్యూ విభాగానికి 3 ఫిర్యాదులు వచ్చాయి. ఫైనాన్స్, పారిశుధ్య, అర్బన్ బయోడైవర్సిటీ, విజిలెన్స్ విభాగాలకు చెరో ఒక్క ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. పౌరుల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.


