ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ
కాకతీయ, కూసుమంచి: మండలంలోని తురకగూడెం గ్రామంలో శుక్రవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ బుర్ర కృష్ణ, పంచాయతీ కార్యదర్శి మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మార్చి 6 నుంచి 15 వరకు గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించేందుకు గ్రామ సభలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలు వెల్లడించగా వాటిపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు బుర్ర వీరభద్రం, కొమ్ము సుధాకర్, కన్నెబోయిన భద్రకాళి, కొమ్ము గోపి, కన్నెబోయిన నాగలక్ష్మి పాల్గొన్నారు. అధికారులు ఏఈఓ జానీ, జేఎల్ఎం గోపి, అంగన్వాడీ టీచర్ ఉపేంద్రమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ రామారావు, విఓ వినోదతో పాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.


