కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమర్పించిన వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు.
ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు రాగా, అధికంగా రెవెన్యూ సమస్యలు 72, జీడబ్ల్యూ ఎంసీ 20, గృహ నిర్మాణ శాఖ 11, విద్యాశాఖ 9, డిఆర్డీఓ 7, ఇతర శాఖలకు సంబంధించిన 47 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎఓ అనురాధ, డిఎం హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


