కాకతీయ, వరంగల్ : సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి 136 ఫిర్యాదులు రాగా, అధికంగా రెవెన్యూ సమస్యలు 60, జిడబ్ల్యూ ఎంసీ 21, విద్యాశాఖ 11, సహాకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, వైద్య ఆరోగ్య శాఖ, ఉపాధి కల్పన శాఖలకు 3 చొప్పున, ఇతర శాఖలకు సంబంధించిన 22 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు దరఖాస్తుల లో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి, మానవతా దృక్పథంతో పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.
ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌లు సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎం హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, హౌసింగ్ పీడీ గణపతి, డీసీఓ రాజమణి, ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, ఆర్సివో అపర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


