కొమ్మాల అంగడి బహిరంగ వేలం
విశ్వనాథపురం జీపీలో 13 వారాలకు వేలం
రూ.36,71,000/- దక్కించుకు గూగులోతు రాజు
కాకతీయ,గీసుగొండ :కొమ్మాల అంగడిలో విశ్వనాథపురం గ్రామానికి చెందిన 13 వారాల గాను గ్రామ పంచాయతీ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ బాదావత్ జ్యోతి అధ్యక్షతన,ఎంపీఓ పాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ కొనసాగింది.వేలం ప్రక్రియలో మొత్తం 35 మంది డీడీలు తీసి టెండర్‌లో పాల్గొనగా,జన్ను శ్రావణ్ రూ.36,00,116కు సీల్డ్ కవర్ టెండర్ దాఖలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ వేలంలో 7 మంది పాల్గొని హోరాహోరీగా పోటీ పడ్డారు. చివరికి గుగులోతు రాజు రూ.36,71,000/-అత్యధిక ధర పలికి విజేతగా నిలిచారు. దీంతో ఆయనకు ఈ ఏడాదికి సంబంధించిన అంగడి హక్కులు దక్కాయి.ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ఆదాయం రావడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళి కృష్ణ,వార్డు సభ్యులు గ్రామస్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


