epaper
Saturday, March 7, 2026
epaper

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక శుభ సూచకం

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక శుభ సూచకం
ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
లింగాల ఘనపురంలో ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభం
శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాక‌తీయ‌,జ‌న‌గామ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం లింగాల ఘనపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉండి ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుందని అన్నారు. జనగామ జిల్లాను ధాన్యం ఉత్పత్తి, నీటిపారుదల, విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరేలా అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక వైద్య శిబిరంలో కంటి, దంత, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలకు చెందిన వైద్యులు సేవలు అందించారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఆరోగ్య సేవల విస్తరణ

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ముందస్తు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది గ్రామస్థాయి నుంచి ప్రజల సహకారంతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, దంత చికిత్స గది, జనరల్ వార్డు తదితర విభాగాలను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, వైద్య అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకానికి ప‌రిపాలనా అనుమతి జీడ‌బ్ల్యూఎంసీ...

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం మంత్రి కొండా సురేఖ ​శివ నగర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ 35వ...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి కాకతీయ, చెన్నారావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ...

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం కాకతీయ, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో...

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!? కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు డ్రెస్...

పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో...

ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దిశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img