కాకతీయ, గీసుగొండ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజేపి మండల నాయకులు నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఎలుకుర్తి, ఆరే పల్లిలో చొక్కం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎ. రాజి రెడ్డి, తుమ్మనపల్లి వంశీ, కొమ్మెర మణికంఠ, బూర సందీప్, నాయకోటి చాణిక్య, ఉపాధ్యక్షులు తుమ్మనపల్లి శంకర్రావు, రాణి, జిల్లా కౌన్సిల్ మెంబర్ జాన్ విక్రమ్, మాజీ ఎంపీపీ కామని భాస్కర్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బూర్గుల యుగేంధర్, సోషల్ మీడియా కన్వీనర్ చిలువేరు శివ,స్థానిక నాయకులు ఆకుల వెంకన్న, ఆరకట్ల ప్రవీణ్, ముల్క సత్య నారాయణ, మాడిశెట్టి రాము, గటికే నాగరాజు, ఎంబడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


