కాకతీయ, నల్లబెల్లి: ప్రజలకు దగ్గరగా పరిపాలనను అందించడం, గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నల్లబెల్లి మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ముప్పు కృష్ణ ,ఎంపీడీవో కార్యాలయంలో పసరగొండ రవి లు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజా పాలనలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను వివరించారు.
ప్రభుత్వ పథకాల లక్ష్యం ప్రతి కుటుంబానికి చేరుకోవడమేనని తెలిపారు. ఈ సందర్భంగా సీట్లు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లోనూ అధికారులు జెండాలు ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


