కాకతీయ, గీసుకొండ: ప్రజా పాలన దినోత్సవం వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇన్-చార్జ్ ఎంపీడీవో పాక శ్రీనివాస్, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్, పోలీస్ స్టేషనులో సీఐ ఎ.మహేందర్, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


