కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గార్డ్ వద్ద కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం సిపిఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా అడిషనల్ డీసీపీ వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పోలీస్ సిబ్బంది ప్రధాన కర్తవ్యం అని తెలిపారు. సమాజంలో శాంతి, శ్రేయస్సు నెలకునేలా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీం రావు, ఏసీపీ శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ జి, వెంకటస్వామి, విజయ్ కుమార్, వేణుగోపాల్, యాదగిరి స్వామి, కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


