కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని నరసింగాపురం (అయ్యగారిపల్లి) లో ఇటీవల మలిశెట్టి నర్సమ్మ మృతి చెందడంతో అనాధలుగా మారిన వారి మనువల కోసం చీన్య తండా మాజీ సర్పంచ్ అరుణ హరిచంద్ వారికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం అధ్యక్షుడు మామిడి అశోక్ రూ.5016లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయంగా ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారి పల్లి మాజీ సర్పంచ్ మామిడి శోభన్, రాము తండా మాజీ సర్పంచ్ బానోతు రామన్న, మాజీ ఎంపీటీసీ మాలోత్ మంజుల మంగ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మామిడి భద్రయ్య, కార్యదర్శి మలిశెట్టి, రవి, తొర్రూర్ మార్కెట్ డైరెక్టర్ రవి నాయక్, మలిశెట్టి శ్యామ్, మర్క యాకన్న, కొంత వెంకన్న, మామిడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


