- ఖానాపురం ఎంపీడీవో అద్వైత
కాకతీయ, ఖానాపురం : మండలంలోని బుధరావుపేట గ్రామపంచాయతీని ఎంపీడీవో అద్వైత సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, డంపింగ్ యార్డును పరిశీలించి సిబ్బంది చేపడుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామంలోని మోడల్ స్కూల్ ను పరిశీలించి విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం అశోక్ నగర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సునీల్ రాజ్ పంచాయతీ కార్యదర్శి రజిత పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.


