అసాంఘీక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వండి
ఎస్‌ఐ నరేష్
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలా వరంగల్ తూర్పు కోట పరిధిలో ఎవరైనా అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని మిల్స్ కాలనీ ఎస్సై లావుడ్యా నరేష్ సూచించారు. సోమవారం తూర్పు కోట అఖిల పక్షం ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను స్థానిక కార్పోరేటర్ బోగి సువర్ణ సురేష్ తో కలిసి ఎస్సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ
గంజాయి, అనుమతి లేని మద్యం విక్రయం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు కనబడితే స్థానిక పోలీసులకు వెంటనే తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు మిల్స్ కాలనీ సీఐ : 8712685119, ఎస్సై 8712685092లో సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. కార్యక్రమంలో తూర్పు కోట అఖిలపక్ష నాయకులు కందిమల్ల మహేష్, సంగరబోయిన విజయ్, బోయిని దూడయ్య, నర్రా ప్రతాప్, గన్నారపు రమేష్, సుంచు జగదీశ్, సంగరబోయిన చందర్, బెడద వీరన్న, అర్సం రాంబాబు, వనపర్తి ధర్మరాజు, అల్లం కేశవరాజు, బోలుగొడ్డు శ్రీనివాస్, ఏసీరెడ్డి రమేష్, నలివెల రవీందర్, తగరపు వేణు, బిల్ల రవి, మేకల కుమార్, కలకొట్ల కుమార్, బోలుగొడ్డు అమృత్, నండ్రే అమర్, చింతం రమేష్, బిల్ల కిశోర్, సుంచు వీరన్న, రాజమల్లు, ప్రతాప్, బేర వేణు, బండి కృష్ణ, బేర నరేందర్ తదితరులు పాల్గొన్నారు


