కాకతీయ, మహబూబాబాద్ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో బుధవారం “స్వస్థ నారి – స్వశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మెగా మెడికల్ హెల్త్ క్యాంప్‌ను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు డా. రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, సమగ్ర వైద్య సేవలను అందించడాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు.
ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన కార్డులు అందజేస్తారని అన్నారు. ఈ శిబిరంలో 371 మందికి పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ప్రతిరోజు ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాంపులు నిర్వస్తారని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, జిల్లా వైద్యశాఖఅధికారి డా. బి. రవి రాథోడ్, డా. చింత రమేష్ (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్), డా. శ్రీనివాసరావు (జిజిహెచ్ సూపర్డెంట్), డా. ఎల్. వెంకన్న (మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్), డా. సుధీర్ రెడ్డి (డిప్యూటీ డీఎంహెచ్‌ఓ), డా. సారంగం, డా. లక్ష్మీనారాయణ, డా. నాగేశ్వరరావు, డాక్టర్ విజయ్ కుమార్, డా. చైతన్య, డాక్టర్ మౌనిక, డాక్టర్ సాగర్, స్పెషాలిటీ డాక్టర్స్,డాక్టర్ శ్రీవిద్య గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ డాక్టర్ దివ్య, ఈఎన్టీ డాక్టర్ సతీష్ నాయక్, ఆప్తమాలాజి, డాక్టర్ కవిత, అనస్తీసియా డాక్టర్ కోటేశ్వరరావు, డెంటిస్ట్ డాక్టర్ అన్నపూర్ణ, సైకియాట్రిస్ట్ డాక్టర్ మానస సౌమ్య, చర్మ డాక్టర్ అర్జున్. స్పెషలిస్ట్ డాక్టర్ అర్జున్, కెవి రాజు, పురుషోత్తం, గీత, రామకృష్ణ, వైద్యాధికారులు డాక్టర్ మౌనిక, డాక్టర్ అర్జున్, డాక్టర్ సాగర్, నీలోహన, శ్రీనివాస్, స్వామి, అనిల్ కుమార్, సౌమిత్, ఉమాకార్, సాయికుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


