పసికందు మృతిపై రజక సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా..
కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఆదివారం జరిగినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రజకులను దైవ దర్శనానికి గుడిలోకి వెళ్ళనివ్వకుండా, అడ్డుకొని పసికందు అని చూడకుండా రెండు నెలల పసి పాపను ప్రాణాలు తీసిన దుర్మార్గులను పోలీసులు వెంటనే శిక్షించాలని సోమవారం రోజు రజక సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఊరుకునే ప్రసక్తే లేదని, రజకులు హెచ్చరించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని సుద్దుమణిగించారు. ఈ సందర్భంగా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, శంకరయ్య, దండు కొమురయ్య, రసమల్ల శ్రీనివాస్, నాంపల్లి ఆదిత్య, బీసీ సంఘం నేతలు జక్కని సంజయ్, అభిలాష్, రాజకీయ నాయకులు రజక సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


