కాకతీయ, హనుమకొండ : కాకతీయ వైద్య కళాశాల మెన్స్ & ఉమెన్స్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్స్ గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా వారు గత ఏడు రోజులుగా ఏకశిలా పార్కులో నిరసన కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సి ఐ టి యూ ) రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్ మాట్లాడుతూ.. తక్షణమే ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. లేకపోతే వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని సంఘాలను ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లం రమేష్, రాణి, రాజకుమారి, ఎం.డి. అతిక్, రాము, మంద కవిత, రవి, బాబు, శశి, బరుపాటి యాకయ్య, సునీత, జ్యోతి, ప్రకాష్, పరమేశ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


