కాకతీయ, నర్సంపేట: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ.. నర్సంపేట బస్టాండ్ లో పలు అభివృద్ధి పనులు, ఆధునీకరణకు ప్రతిపాదనలు సమర్పించినట్లు దీంతో పాటుగా నెక్కొండ బస్టాండ్ ఆవరణంలో సీసీ ఫ్లాట్ఫార్మ్ నిర్మించాలని కోరినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ సింగ్ లాల్ ఉన్నారు.


