మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్
కాకతీయ మహబూబాబాద్: జిల్లాకేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మహబూబాబాద్ శాససభ్యుడు డాక్టర్ మురళి నాయక్ ను క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో చర్చించి ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని, నేడు ఉద్యమకారులు పడుతున్న బాధల గురించి ఎమ్మెల్యేకు వివరించి మెమోరాండం ఇచ్చారు. డిసెంబర్లో 9 లోగా ఇస్తానన్న హామీల నెరవేర్చాలని కోరారు. ఉద్యమ కారులకు రూ. 25వేల పెన్షన్ ఇవ్వాలని, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ఉద్యమకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఉద్యకారుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి నాయిని శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ నియోజకవర్గం కన్వీనర్ దేశగాని కృష్ణ, ముఖ్యసలహదారులు సమ్మయ్య గౌడ్, నర్సింహుల పేట మండల అధ్యక్షుడు బానోత్ లాలు నాయక్, ఉపాధ్యక్షుడు ఆకుతోట వెంకటయ్య, రేఖ నర్సయ్య, సాయికృష్ణ, బొమ్మగాని వెంకన్న, గండి సత్యనారాయణ, భీమనపల్లి యాదగిరి, చిర్ర ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


