బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర
42వ డివిజన్‌లో పార్టీకి బలం
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గంగుల
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర రఘునాథరావు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నగరంలో మరింత బలపడుతోందన్నారు. గండ్ర రఘునాథరావు పార్టీలో చేరడం 42వ డివిజన్‌తో పాటు నగర రాజకీయాల్లో బీఆర్ఎస్‌కు అదనపు శక్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, బోనాల శ్రీకాంత్, గందే మహేష్, దిండిగాల మహేష్, ఎడ్ల అశోక్, వాల రమణారావు, నాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే నాయకులు సుంకిశాల సంపత్ రావు, జువ్వాడి రాజేశ్వర్ రావు తదితరులు హాజరయ్యారు.


