జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిషన్ డిక్లరేషన్
వరంగల్ జిల్లా ఉద్యోగుల్లో ఉత్సాహం
జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి కృతజ్ఞతలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా జూనియర్ అసిస్టెంట్ల ప్రొబేషన్ డిక్లేరేషన్కు కృషి చేసిన ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) చైర్మన్, టీజీఆర్ఎస్ఏ గౌరవ అధ్యక్షుడు *లచ్చిరెడ్డి*కు వరంగల్ జిల్లా జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి స్పందిస్తూ, తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కూడా త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన జీఓను సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రొబేషన్ డిక్లేరేషన్తో వరంగల్ జిల్లా ఉద్యోగుల్లో ఉత్సాహం పెరిగిందని, తెలంగాణ ఇంక్రిమెంట్‌పై కూడా ఆశాకిరణాలు ఏర్పడ్డాయని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోమాండ్ల రాజు, టీజీఆర్ఎస్ఏ జనగామ వైస్ ప్రెసిడెంట్ ఎడ్ల రవి, గణేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


