కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ ఇస్తే కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లి పదవి నుంచి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇదేం పైశాచిక ఆనందమంటూ ప్రశ్నించారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
కోదండరామ్ కు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ ప్రకటించారు. మీ ఇంటిల్లిపాదీ మంత్రులుగా ఉంటే తప్పు లేదు కానీ.. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే తప్పా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అంటూ సీఎం కొనియాడారు. తెలంగాణ, ఉస్మానియా రెండు అవిభక్త కవలలు అన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ అని సీఎం అన్నారు.


