కాకతీయ, సినిమా డెస్క్: హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫౌజీ మూవీగా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది. అందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించడంతో అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దాన్ని కూడా తెగ షేర్ చేశారు. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ ఫొటో లీక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఇక ఫౌజీ మూవీ విషయానికి వస్తే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్ తో రెడీ అవుతోంది. ప్రభాస్ కు జంటగా సోషల్ మీడయా స్టర్ ఇమాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940వ దశకంలో జరిగే కథగా మాత్రుభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా ఈ సినిమా రానుంది.


