నిబద్ధతతో సమస్యలను పరిష్కరించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
వివిధ విభాగాలకు చెందిన 86 ఫిర్యాదుల స్వీకరణ
కాకతీయ, వరంగల్ : నిబద్ధతతో గ్రీవెన్స్ కు ప్రజలు విన్నవించుకున్న సమస్యలను పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుండి 86 ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. వినతుల వివరాలు ఇలా.. టౌన్ ప్లానింగ్ విభాగానికి 33, ఇంజనీరింగ్ విభాగానికి 29, రెవెన్యూకు 6, హెల్త్ అండ్ శానిటేషన్ కు 12, నీటి సరఫరాకు 6 చొప్పున మొత్తం 86 వినతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ రమేష్, డిఎఫ్ఓ శంకర్ లింగం, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఎంహెచ్ఓ డా.రాజేష్, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


