ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం
కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మండలంలోని శివాజినగర్ గ్రామంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలను ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ సుకినే నాగరాజు విజేతలకు మొదటి, రెండో, మూడో బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుస్సారి రామారావు, వార్డు సభ్యులు కాలే వాని, బూర్గుల రాజేశ్వరరావు, బోరగాని రజిత, బోళ్ల స్వామి, మరియు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సుకినే శ్రీనివాస్, డోకిలే నగేష్ , గుండెకారి రామారావు, తిరుమల రావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


