ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానోత్సవం
39వ డివిజన్‌లో ఇమామ్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు
మహిళల భారీ పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతం
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 39వ డివిజన్‌లో ఇమామ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. పోటీలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై రంగురంగుల ముగ్గులతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా క్యాంప్ కార్యాలయం ఇన్‌చార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి, నాదెండ్ల దీపక్ చౌదరి, ఒట్టి కొమ్ము శ్రీనివాస్ రెడ్డి, టెలికాం డైరెక్టర్ ఇమామ్ ఉమ్మినేని కృష్ణ తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హారిక నాయుడు, కొర్లపాటి అన్నపూర్ణ, గన్నోజు గోవిందమ్మ, ఝాన్సీ విప్లవం నాగేశ్వరరావు, ఫయాజ్ ఇర్ఫాన్, నరసింహారావు, వాజిద్ కాజు ఖాదర్ పాల్గొన్నారు. మహిళల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతమైంది.


