కాకతీయ, హుజురాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. హుజురాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయి మాట్లడుతూ.. పేదల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. దినసరి అవసరాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో జీవన వ్యయం తగ్గనుందని, పేద కుటుంబాలకు ఇది నిజమైన పండుగ బహుమతిగా నిలుస్తుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడగా, మోదీ సంస్కరణలు ఉపశమనం కలిగిస్తున్నాయన్నారు. సెప్టెంబర్ 22 నుంచి నూతన జీఎస్టీ అమల్లోకి రానుందనన్నారు. నిజాయితీ గల మోదీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలపై పన్నుల భారం భారీగా తగ్గిందని, వినియోగదారులకు ఉపశమనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి బీజేపీ జిల్లా శాఖ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ నాయకులు నల్ల సుమన్, కొల్లిపాక శ్రీనివాస్ తదితర బీజేపీ నాయకులు పాల్గోన్నారు.


