గొడవలు అరికట్టేందుకు ముందస్తు చర్యలు
బిర్యానీ హోటల్స్, పాన్‌షాపుల యజమానులపై బైండ్‌ఓవర్
కాకతీయ, ఖిలావరంగల్ : మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా చోటుచేసుకునే గొడవలను నిరోధించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బిర్యానీ హోటల్స్, పాన్ షాపులు నిర్వహిస్తున్న యజమానులను ఎమ్మార్వో వద్ద బైండ్‌ఓవర్ చేశారు. రోజూ వివాదాలకు కారణంగా మారుతున్న కొన్ని షాపుల యాజమాన్యాలను పోలీసులు మందలించి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యవహారాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్ధరాత్రి వేళల్లో షాపుల వద్ద ఏదైనా గొడవలు చోటుచేసుకున్నా, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ స్పష్టం చేశారు.


