కాకతీయ, వరంగల్ : వర్షాలు పడి సీజనల్ వ్యాధులు సంక్రమిస్తున్న తరుణంలో రంగశాయిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. శ్రీ సాయి నగర్ కాలనీలోనీ ప్రజలందరికీ బిపి, షుగర్ టెస్టులను నిర్వహించి, అలాగే జ్వరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. వచ్చిన వారికి సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కొమురయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, కాలనీ పెద్దలు మెంతుల వెంకటేశ్వర్లు, బొల్లోజు కృష్ణమూర్తి, బండారి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: డిప్యూటీ డిఎంహెచ్ఓ కొమురయ్య
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


