మృతుడి కుటుంబానికి ప్రణవ్ పరామర్శ
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణం 7వ వార్డు మాజీ కౌన్సిలర్ పొనగంటి సారంగం గారి దశదినకర్మ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సారంగం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రణవ్ బాబు, ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


