- గ్రామాల్లో సమస్యల పరిష్కారనికి కృషి
- రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకం
- హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గoలో ఉన్న అన్ని గ్రామాల్లో సమస్యలపై ఎక్కడా రాజీపడవద్దని, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున పల్లె పల్లెకు ప్రణవ్ కార్యక్రమం ద్వారా ఇల్లందకుంట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా మండల వ్యాప్తంగా 6,28,000/- విలువ చేసే 19 సీఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామాల్లోని లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు త్వరితగతిన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలి కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోందన్నారు.
ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని అన్నారు. పదేళ్లుగా ఎదురుచూసిన ఇందిరమ్మ ఇళ్లు,ఉచిత సన్న బియ్యం, రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఆరోగ్య శ్రీ పథకం పెంపులాంటి పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ వచ్చాయని అన్నారు. అలాగే నూతన రేషన్ కార్డులు నంబర్ ఆడిషన్స్,మహిళలకు ఉచిత బస్ రవాణా సౌకర్యం లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందిందని ఇది జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కోరారు. కోవర్ట్, గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా కష్టపడి పనిచేస్తే ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా జిల్లాలో మొదటి స్థానంలో వచ్చామో రాబోయే స్థానిక పోరులో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కృషితో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇల్లందకుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామాల కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


