ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..
సొంతింటి కళ కోసం ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండ
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పెదోల్ల ప్రభుత్వం
అర్హులైన అందరికి విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాం..
కాకతీయ, హుజురాబాద్: ప్రతి పేదవారి కుటుంబంలో సొంతింటి కళ అనేది జీవిత లక్ష్యమని అలాంటి కళను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం,కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నెరవేరుస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజూరాబాద్ పట్టణ పరిధిలోని ఒకటవ వార్డు కొత్తపల్లిలో గౌరవేని లక్ష్మీ నూతన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గృహ ప్రవేశ సమయంలో లబ్ధిదారు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.ఇంటి నిర్మాణం కోసం ఇన్నేళ్లుగా ఎదురు చూశామని ఇప్పుడు ఇళ్లు కట్టుకొని గృహ ప్రవేశానికి వెళ్లడం ఆనందంగా ఉందని తెలిపారు.రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి విడతల వారిగా ఇళ్లు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



