రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత
ఉత్సవ కమిటీలో స్థానం కల్పించిన ప్రభుత్వం
భద్రాచలం ఉత్సవాల కోసం 14 మంది సభ్యులతో కమిటీ
కాకతీయ, బూర్గంపాడు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఉత్సవ కమిటీలో పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన నియామకంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 14 మంది సభ్యులతో నూతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జాబితాలో బూర్గంపాడు మండలానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పేరు చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడారు. రామయ్య ఆశీర్వాదంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.


