గ్రూపు 1 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఎంపీడీవోలుగా పోస్టింగు
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా లో ఖాళీగా ఉన్న 5 ఎంపిడిఓ పోస్టులకు ఈ మధ్యకాలంలో గ్రూప్ 1 ద్వారా ఎంపికైన అభ్యర్థుల ద్వారా భర్తీ చేసి అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం జారి చేసినట్లు తెలిపారు.వారిలో మహబూబాబాద్ మండలం డి.సుస్మిత, చిన్న గూడూరు ఎం.సుజాత, నరసింహలపేట వై.అంజలి, గంగారం డి.వైష్ణవి, బయ్యారం డి.దీపిక, లకు జిల్లా ఏఓ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
అభ్యర్థులు విధులలో చేరి, హైద్రాబాద్ లోని తెలంగాణ ఐఆర్డి శిక్షణ సంస్థలో రెండు వారాల పాటు శిక్షణకు వెళ్లాలని జడ్పీ సీఈవో పురుషోత్తం ఆదేశించారు.


