కాకతీయ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద శుక్రవారం హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా సరఫరా చేస్తున్న క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన సీఐ హమాలీల పట్ల దురుసుగా ప్రవర్తించాడు.
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ యూరియా పంపిణీ కేంద్రానికి చేరుకొని నిరసన తెలిపిన హమాలీలను ఆప్యాయంగా పలకరించారు. అన్నం పెట్టే రైతన్నలకు మనమందరం కష్టకాలంలో తోడుగా ఉండాలని సూచించారు.
అధికారులు ఎవరైనా అమర్యాదగా, దురుసుగా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థం చేసుకొని సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఎస్పీ చొరవతో హమాలీలు నిరసనను విరమింపజేశారు. హమాలీలు నిరసనకు దిగిన సమయంలో వారిని శాంతింప చేయడం కొరకు డిఎస్పీ మోహన్, ఎస్సై సురేష్ లు చూపిన చొరవను రైతులు అభినందించారు.


