epaper
Sunday, March 1, 2026
epaper

ఎంజీఎంలో అధ్వానంగా వైద్యం

ఎంజీఎంలో అధ్వానంగా వైద్యం
ఉత్త‌ర తెలంగాణకు పెద్ద దిక్కైనా ఆస్ప‌త్రిపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం
వెంటాడుతున్న మందుల కొర‌త‌.. స‌రిపోను బెడ్లు క‌రువు
ఎంజీఎంకు వ‌స్తే ప్రాణాలు అటో ఇటో..! అన్న ప‌రిస్థితి
గాడి త‌ప్పిన ప‌రిపాల‌నా.. లోపిస్తున్న ప‌ర్య‌వేక్ష‌ణ‌
క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద శ్ర‌ద్ధ చూపినా.. ప్ర‌భుత్వం నుంచి చ‌ర్య‌ల లేమి

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ : ఉత్త‌ర తెలంగాణ‌కు పెద్ద దిక్కుగా ఉన్న మ‌హాత్మ గాంధీ మెమోరియ‌ల్ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ పూర్తిగా గాడి త‌ప్పింది. ఆస్ప‌త్రిలో సేవ‌లు మృగ్యంగా మారాయి. నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షించ‌డంలో అధికారులు పూర్తిగా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. ఆస్ప‌త్రిలో సేవ‌లు అర‌కొర‌గా అందుతుండ‌ట‌మే కాదు..క‌నీసం పేషంట్ల‌ను చూసేందుకు కూడా వైద్యాధికారులు స‌మ‌య వేళలు పాటించ‌డం లేదు. ఇక ఆస్ప‌త్రికి నిత్యం వంద‌లాది మంది ఓపీ అవుట్ పేషంట్లు వైద్య సేవ‌ల కోసం వ‌స్తుండ‌గా.. వారికి స‌రిపోను బెడ్ల‌ను స‌మ‌కూర్చ‌క‌పోవ‌డం ఆస్ప‌త్రి వైద్యాధికారుల ప‌నితీరుకు అద్దం ప‌డుతోంది. ఓవైపు ఎంజీఎంను అద్భుతంగా తీర్చిదిద్దుతామ‌నే ప్ర‌భుత్వ చెబుతుండ‌గా.. వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం.. అవ‌న్నీ ప్ర‌గ‌ల్బాలు అన్న‌ట్లుగానే ప‌రిస్థితులు తెలియ‌జేస్తున్నాయి. ఒకే బెడ్ లో ఇద్దరు పేషెంట్లు ఉండటమే కాకుండా ఒకే సిలిండర్ ఇద్దరిద్దరికీ ఒకేసారి ఉపయోగించడం జరుగుతోంది. ఇద్దరి చిన్నారులకు ఆక్సిజన్ సిలిండర్ తో తరలిస్తున్నటువంటి దృశ్యాలు శ‌నివారం వెలుగులోకి రావ‌డం ఎంజీఎంలో అత్యంత దారుణ ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.

క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌.. అయినా..!

వాస్త‌వానికి వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద వ‌రంగ‌ల్ ఎంజీఎంను గాడిలో పెట్టేందుకు అనేక మార్లు రివ్యూలు నిర్వ‌హించారు. వైద్యాధికారుల‌ను కూడా మార్చారు. వీలున్న‌ప్పుడ‌ల్లా సంద‌ర్శిస్తున్నారు. అయితే క‌లెక్ట‌ర్ ఎన్ని రివ్యూలు చేసినా.. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ఎంజీఎం అధికారుల్లో మాత్రం పెద్ద‌గా మార్పు ఉండ‌టం లేదు. అంతేకాదు వారి ప‌నితీరులో ఎలాంటి శ్ర‌ద్ధ క‌నిపించ‌డం లేదు. వైద్య సేవ‌లు అంద‌క‌పోవ‌డంతో ఎంజీఎంలో మృత్యుఘోష విన‌బ‌డుతూనే ఉంద‌నే విమ‌ర్శలున్నాయి. ఎంజీఎం ఆసుపత్రిలో కొద్దిరోజుల క్రితం విద్యుత్‌ సరఫరాకు దాదాపు ఐదు గంట‌ల పాటు అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు క‌రెంటు నిలిచిపోయింది. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. ఈ ఘటనలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి బాధ్యులను గుర్తించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. అయితే ఆ నివేదిక అందినా ఎంజీఎం వైద్యాధికారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ప్ర‌భుత్వ ఉదాసీన‌త వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

గ‌తంలో శ‌వాలు తారుమారు..!

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మృతదేహలు మారిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయాడని అంత్యక్రియలకు సిద్ధమైన బంధువులకు పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. చనిపోయాడని భావించిన కుమారస్వామి బతికే ఉన్నాడని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. గ‌తంలో ఎంజీఎం ఆస్ప‌త్రిలో పేషంట్ల రిజిస్ట్రేష‌న్ల వివ‌రాలు కూడా స‌రిగా పొందు ప‌ర్చ‌క‌పోవ‌డంతో శ‌వాలు తారుమార‌య్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మూడు రోజులు చికిత్స పొందిన తర్వాత మరణించాడని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించారు. తర్వాత చివరి చూపు చూసేందుకు శవపై కప్పిన క్లాత్ ను తొలగించి చూశాక అంతా షాక్ అయ్యారు. అతను మా నాన్న కాదని కుమారస్వామి కూతురు స్పష్టంగా చెప్పడంతో తిరిగి శవాన్ని మార్చూరీకి చేర్చారు. అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img