అస్తవ్యస్తంగా డ్రైనేజీ
కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. డ్రైనేజ్ నిండి చెత్త చెదారంతో నిండిపోయి మరుగు నీరు నిల్వ ఉండటంతో డ్రైనేజీలోని నీరు బయటకు వెళ్లకుండా అంతరాయం కలిగి వ్యర్థ పదార్థాలు చెత్త చెదారాలతో దుర్వాసన వెదజల్లుతూ అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగి, రాత్రి పగలు తేడా లేకుండా దోమలు దాడి చేస్తున్నాయని, విష జ్వరాలు విజృంభించి ఆసుపత్రుల పాలవుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు, నాయకులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


