ముగిసిన పోలింగ్ సమయం….ఆందోళనలో అభ్యర్థులు
– 2 గంటలకు మొదలైన ఓట్ల కౌంటింగ్
– మొదటగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు
– వార్డుల లెక్కింపు తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు
– అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ గెలుపు ఎవరిది…
కాకతీయ, రాయపర్తి : మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల సమయం మధ్యాహ్నం 1 గంటలకు ముగియడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని,మొదట వార్డు సభ్యులకు పోలైన ఓట్లను లెక్కించి వార్డు మెంబర్లను ప్రకటించనున్నారు.వార్డులు పూర్తయిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు సమాచారం.సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో గెలుస్తామా ఓటమిపాలవుతామా అని అంతులేని ఆందోళన మొదలైంది. పోలింగ్ సమయం ముగిసే సరికి మండలంలో మొత్తం 37,340 ఓట్లు పోలవగా 85.84 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎంపీడీవో గుగులోత్ కిషన్ తెలిపారు.అలాగే గెలుపు ఎవరి సొంతం అవుతుందోనని ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


