epaper
Monday, March 2, 2026
epaper

నీళ్ల పేరుతో రాజకీయ నాటకాలు

నీళ్ల పేరుతో రాజకీయ నాటకాలు
అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు
కాంగ్రెస్–బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం
తెలంగాణ నీళ్ల ద్రోహానికి రెండు పార్టీలు బాధ్య‌త వ‌హించాలి
కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : నీళ్ల సమస్యను ప్రజల జీవన సమస్యగా కాకుండా రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 6 గ్యారంటీలపై చర్చ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై విచారణ తప్పించుకునేందుకే ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలను వక్రీకరించారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన పాపాలే నేడు తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయని వ్యాఖ్యానించారు.

నీళ్ల ద్రోహానికి తొలి ముద్దాయి కాంగ్రెస్

తెలంగాణకు నీళ్ల అన్యాయం చేసిన మొదటి దోషి కాంగ్రెస్ేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా నదిలో 811 టీఎంసీల వాటా ఉన్నా తెలంగాణకు 200 టీఎంసీలకు మించి వినియోగించుకోకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గోదావరిలో 1486 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా తెలంగాణలో 500 టీఎంసీలకు మించి వాడుకోనీయలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లో తెలంగాణకు కీలకమైన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను చేర్చకపోవడంపై ఆనాటి కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజూ నీళ్లు తరలిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకోలేకపోయాయని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పాలనలో మరణ శాసనం
నీళ్ల విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు మరణ శాసనం అమలైందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయిన కొత్తలో “తెలంగాణకు కేసీఆర్ అనే అణుబాంబు ఉంది” అంటూ డాంబికాలు పలికిన కేసీఆర్ చివరకు ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయారని విమర్శించారు.
తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీలకు బదులు కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుని సంతకం చేసి దక్షిణ తెలంగాణను మోసం చేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరిని అడిగి 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని, అది కేసీఆర్ జాగీరా అని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ సాక్షిగా జరిగిన ఈ ద్రోహాన్ని తానే మొదట బయటపెట్టానన్నారు.

ప్రగతి భవన్ డీల్సే సాక్ష్యం
ప్రగతి భవన్‌లో అప్పటి ఏపీ సీఎం జగన్‌తో సమావేశాలు పెట్టుకుని “బేసిన్లు లేవ్.. బేషజాల్లేవ్” అంటూ డీల్స్ మాట్లాడలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రోజా ఇంట్లో విందులు, రొయ్యల పులుసుల వెనుక ఉన్న మర్మాన్ని కల్వకుంట్ల కవిత బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై అప్పట్లో వచ్చిన వార్తలను కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు.
తెలంగాణ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే కేసీఆర్ 575 టీఎంసీల మాట మాట్లాడారని, కేఆర్ఎంబీకి లేఖ రాసి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపింది కేంద్రమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టుకుంటూ అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ 6 గ్యారంటీలపై చర్చ జరపాలని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కలిసి రావాలని రెండు పార్టీలను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ కావాలనే దాచిపెడుతున్నాయని ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img